ePaper
More
    Homeక్రీడలుIND vs ENG | రెండు ఇన్నింగ్స్‌ల్లో పంత్ సెంచ‌రీ.. తొలి టెస్ట్‌పై ప‌ట్టు సాధిస్తారా..!

    IND vs ENG | రెండు ఇన్నింగ్స్‌ల్లో పంత్ సెంచ‌రీ.. తొలి టెస్ట్‌పై ప‌ట్టు సాధిస్తారా..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : రోహిత్ శ‌ర్మ‌ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో యువ ఆట‌గాళ్ల‌తో కూడిన భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ (England) గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో మ‌న భారత బ్యాట్స్‌మెన్ పోటీలు ప‌డి మ‌రి సెంచ‌రీలు చేస్తున్నారు. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు.

    టెస్ట్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా రిషభ్​ పంత్ నిలిచాడు. క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా కూడా పంత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులతో రాణించిన పంత్ Rishabh Pant.. రెండో ఇన్నింగ్స్‌లో 129 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. తద్వార అరుదైన వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

    IND vs ENG : పంతా, మ‌జాకానా?

    రిషభ్ పంత్‌ (Rishabh Pant)కు ఇది 8వ టెస్ట్ సెంచరీ. ఇప్పటికే అతను టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సాధించాడు. 90/2 ఓవర్‌ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా (Team India)కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు అతను రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో పంత్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కండిషన్స్ బౌలింగ్‌‌కు అనుకూలంగా ఉండడంతో ఈ జోడీ ఓపికగా ఆడింది. ఈ క్రమంలో రాహుల్ Kl Rahul 87 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ 153/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్‌లో పంత్ దూకుడుగా ఆడగా.. రాహుల్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.

    83 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన పంత్ అనంతరం భారీ సిక్సర్లు బాదాడు. మరోవైపు బషీర్ బౌలింగ్‌లో క్విక్ డబుల్ తీసి రాహుల్ 202 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సెంచరీకి చేరువైన పంత్.. మూడెంకల మార్క్ అందుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఒంటి కన్ను సెలెబ్రేషన్స్‌తో అందర్నీ ఆశ్చర్య పరిచాడు. బషీర్ బౌలింగ్‌లో పంత్ (118) భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 195 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

    ప్రస్తుత భారత్ ఆధిక్యం 333 పరుగులు దాటింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. క్రీజులో కేఎల్ రాహుల్‌( 137 నాటౌట్), కరుణ్ నాయ‌ర్ Karun Nayar (19 నాటౌట్‌) ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...