అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sindh province : భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ అంతర్గత సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఇప్పటికే బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తుక్వాలో ఆందోళనలు, దాడులు నిత్యకృత్యం కాగా, ఇప్పుడు సింధ్ ప్రావిన్సు అల్లకల్లోలంగా మారింది. సింధ్ కాలువ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు భారీ ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఇద్దరు నిరసనకారులు మరణించడంతో సింధ్ ప్రావిన్సు ఉద్రిక్తంగా మారింది.
సింధ్ జాతీయవాద పార్టీ జై సింధ్ ముత్తహిదా మహజ్ Zahid Laghari, an activist of the Sindh nationalist party Jai Sindh Muttahida Mahaz (JSMM) కార్యకర్త జాహిద్ లఘారిని పోలీసులు కాల్చి చంపారు. దీన్ని నిరసిస్తూ ఉత్తర సింధ్‌లోని నౌషాహ్రో ఫిరోజ్ జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. గూడ్స్ ట్రక్కులను, పెట్రోలియం కంపెనీ కార్యాలయాన్ని దోచుకున్నారు. అలాగే, సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజార్(Sindh Home Minister Ziaul Hassan Lanzar) ఇంటిని తగులబెట్టారు.
Sindh province : ఐదుగురి పరిస్థితి విషమం..
నౌషాహ్రో ఫిరోజ్ జిల్లా(Nowshahr Feroze district)లోని మోరో పట్టణంలో పరిస్థితి చేయి దాటుతుండడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో 15 మందికి పైగా నిరసనకారులు గాయపడగా, వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. బుల్లెట్ గాయాలతో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని నవాబ్షాలోని పీపుల్స్ మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యార్ మొహమ్మద్ జమాలీ పేర్కొన్నారు. మరోవైపు, పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఆరుగురికి గాయాలయ్యాయి.
Sindh province : రగులుతోన్న సిందు ప్రావిన్సు
గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా 3.3 బిలియన్ డాలర్లతో సైన్యం మద్దతుతో నిర్మిస్తున్న సింధు నది ప్రాజెక్టు(Indus River Project)కు వ్యతిరేకంగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో సింధ్ ప్రావిన్స్ ఉడికిపోతోంది. సింధు నదిపై నిర్మిస్తున్న కాలువలు ప్రధానంగా పంజాబ్ భూస్వాముల(Punjabi landlords)కు, కార్పొరేట్ వ్యవసాయ సంస్థ(corporate agricultural companies)లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయని సింధు ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ ప్రాంతంలో నీటి కొరత తలెత్తుతుందని, పైగా సింధు నీటిపై పంజాబు ప్రాంతానికి ఆధిపత్యం లభిస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగుతున్నారు. స్థానికుల అభ్యంతరాలతో గత ఏప్రిల్‌లో పనులు నిలిపి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, రహస్యంగా పనులు జరుగుతున్నాయి. దీంతో స్థానికులు మరోమారు పోరుబాట పట్టడంతో సింధ్ ప్రావిన్స్ అట్టుడుకుతోంది.
