అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bangladesh | బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. భారత వ్యతిరేక ఆందోళనలు అక్కడ తీవ్రతరం అయ్యాయి. రెబల్ గ్రూప్ లీడర్ మరణించడంతో యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లోని ప్రధాన మీడియా సంస్థలను నిరసనకారులు ముట్టడించారు. భవనాలను నిప్పు పెట్టారు. జర్నలిస్టులపై దాడులు చేశారు. , చిట్టగాంగ్ (Chittagong)లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. దీంతో బంగ్లాలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Bangladesh | అతడి మృతితో..
విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాడి మరణం తరువాత బంగ్లాదేశ్ హింసాత్మకంగా మారింది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం సంయమనం పాటించాలని, మూక హింసను మానాలని కోరింది. అశాంతికి “కొన్ని చిన్న శక్తులు” కారణమని ఆరోపించింది. హింస, బెదిరింపు, ఆస్తుల విధ్వంసం వంటి అన్ని చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. జర్నలిస్టులకు (Journalists) ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. హిందూ వ్యక్తిని కొట్టి చంపడాన్ని ఖండించింది
హాది మరణ వార్త తర్వాత నిరసనలు చెలరేగడంతో మీడియా సంస్థల కార్యాలయాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ప్రభుత్వం మీడియా సంస్థల కార్యాలయాల వద్ద భారీగా పోలీసులను మోహరించింది. రాజ్‌షాహిలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయం (Awami League Party Office) కూడా నిరసనకారులు తగలబెట్టినట్లు తెలుస్తోంది. దేవదూషణ పేరుతో నిరసనకారులు ఒక హిందూ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపడాన్ని ప్రభుత్వం ఖండించింది, దీపు చంద్ర దాస్ అనే బాధితుడిపై మైమెన్సింగ్ జిల్లాలో గురువారం రాత్రి ఒక మూక దాడి చేసింది.
Bangladesh | హదీ ఎవరంటే..
షరీఫ్ ఉస్మాన్ హదీ ఒక విద్యార్థి నాయకుడు. షేక్ హసినాను పదవి నుంచి దింపేయడానికి కారణమైన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల ఆయన హత్యకు గురయ్యాడు. దీంతో హసీనా వ్యతిరేక వేదిక అయిన ఇంక్విలాబ్ మంచా మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మీడియా కార్యాలయాలపై దాడులు, భారత దౌత్య కార్యాలయాల వెలుపల ప్రదర్శనలు చేపట్టారు. కాగా శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ముసుగు ధరించిన దుండగులు హదీని తలపై కాల్చి చంపారు. అతను భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని కొన్ని భాగాలను కలిపి ఉన్న ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌ను ప్రచారం చేసినట్లు సమాచారం.