- Advertisement -
HomeUncategorizedRinku Singh | ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్

Rinku Singh | ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rinku Singh | టీమిండియా యువ ప్లేయ‌ర్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఇటీవ‌ల కుల్దీప్ యాద‌వ్ (Kuldeep Yadav) నిశ్చితార్థం జ‌రుపుకోగా, త్వ‌ర‌లోనే ఆయ‌న వివాహం జ‌ర‌గ‌నుంది. ఇక ఇప్పుడు రింకూ సింగ్ (Rinku Singh).. ఎంపీతో నిశ్చితార్థం జ‌రుపుకున్నారు.

యూపీలోని (Uttar Pradesh) లక్నోలో ఆదివారం క్రికెటర్ రింకూ, స‌మాజ్‌వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ (Samajwadi party MP) నిశ్చితార్థం ఇరుకుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఘ‌నంగా నిర్వహించారు. రింకూ సింగ్ (Rinku singh), ప్రియా సరోజ్(priya ssaroj)ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫస్ట్ వీడియో వచ్చేసింది. ఆ వీడియోలో రింకూ సింగ్, ప్రియా సరోజ్ జంట చేతులు పట్టుకుని నవ్వుతూ కనిపించారు.

- Advertisement -

Rinku Singh | ఘ‌నంగా నిశ్చితార్థ కార్య‌క్ర‌మం..

వీరిద్దరి వివాహానికి దేశంలోని ప్రముఖులు హాజరుకానుండగా.. నిశ్చితార్థానికి అఖిలేష్ యాదవ్‌తో (Akhilesh yadav) పాటు పలువురు వీవీఐపీలు హాజరైన‌ట్టు తెలుస్తుంది. ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ (Rinku Singh) నిశ్చితార్థ వేడుకకు ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఎస్పీ ఎంపీ జయా బచ్చన్, ఇఖ్రా హసన్ వంటి వారితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హ‌జ‌రైన‌ట్టు తెలుస్తుంది. రింకూ సింగ్ చిన్ననాటి నుంచి ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లో ఎదిగాడు. కానీ క్రికెట్‌లో (Cricket) తనదైన ముద్ర వేస్తూ టీమిండియా (Team india) వరకు ఎదిగాడు. ఇప్పుడు ఓ ఎంపీ అయిన ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా.. వీరి నిశితార్థ వేడుకలో భాగంగా గులాబ్ కి తండి ఖీర్, ఆచారి సిగార్ రోల్ , మలై కోఫ్తా, కడాయి పన్నీర్ వంటివి ప్రత్యేంగా రెడీ చేశారు. అన్నిరకాల ఫుడ్ వెరైటీలు అతిథుల కోసం తయారు చేయించారు. కాగా, ప్రియా సరోజ్ తండ్రి.. తుఫానీ సరోజ్ మూడు సార్లు సమాజ్ వాది పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రియా సరోజ్ (Priya Saroj).. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మచిలీషహర్ నుంచి ఎస్పీ పార్టీ తరఫున పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది.

“ఈ రోజు తమ జీవితంలో ఎంతో మంచి రోజుగా చెప్పుకొచ్చారు. వేడుకలకు వచ్చిన అతిథులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.” ప్రియా సరోజ్ గతంలో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేశారు. రింకూసింగ్ (Rinku Singh) ప్రస్తుతం క్రికెటర్ గా తనదైన శైలీలో రాణిస్తున్నాడు. అయితే.. వీరి పెళ్లి నవంబర్ 18న వారాణాసిలోని (varanasi city) హోటల్ తాజ్ లో గ్రాండ్ గా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం రింకూ, ప్రియా నిశ్చితార్థం పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News