అక్షరటుడే, వెబ్డెస్క్: Ring of Fire | అంతరిక్షంలో జరిగే అద్భుత దృశ్యాలను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి.. ముఖ్యంగా సూర్యగ్రహణం అంటే ఖగోళ శాస్త్రవేత్తలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఎంతో కుతూహలం.
అలాంటి ఒక అద్భుతమైన ఖగోళ వింత 2026 సంవత్సరంలో మనల్ని పలకరించబోతోంది. అదే ‘కంకణ సూర్యగ్రహణం’. దీనినే ప్రపంచవ్యాప్తంగా “రింగ్ ఆఫ్ ఫైర్” (Ring of Fire) అని ఎంతో ఆసక్తిగా పిలుచుకుంటారు. ఈ అరుదైన దృశ్యం 2026, ఫిబ్రవరి 17వ తేదీన ఆకాశంలో ఆవిష్కృతం కానుంది.
Ring of Fire | అసలు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి?
సాధారణంగా భూమికి, సూర్యుడికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని మనకు తెలుసు. అయితే, ఈ కంకణ సూర్యగ్రహణం వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ సమయంలో చంద్రుడు భూమికి ఉండాల్సిన దూరం కంటే కొంచెం ఎక్కువ దూరంలో ఉంటాడు.
దీనివల్ల చంద్రుడి పరిమాణం సూర్యుడి కంటే చిన్నదిగా కనిపిస్తుంది. ఫలితంగా, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పలేక కేవలం మధ్య భాగాన్ని మాత్రమే అడ్డుకుంటాడు. అప్పుడు సూర్యుడి చుట్టూ ఉన్న అంచులు ప్రకాశవంతంగా మెరుస్తూ, ఆకాశంలో ఒక నిప్పుల వలయంలా లేదా ఒక బంగారు గాజులా కనిపిస్తాయి. అందుకే దీనికి ‘కంకణ’ సూర్యగ్రహణం అనే పేరు వచ్చింది.
Ring of Fire | భారతదేశంలో కనిపిస్తుందా..
ఖగోళ ప్రేమికులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే అని చెప్పాలి. ఎందుకంటే 2026 ఫిబ్రవరి 17న జరగబోయే ఈ సూర్యగ్రహణం మన దేశంలో నేరుగా కనిపించదు. కేవలం దక్షిణార్ధగోళంలోని కొన్ని దేశాలకు మాత్రమే ఈ అదృష్టం దక్కనుంది. అయితే బాధపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పుణ్యమా అని మనం ఎక్కడ ఉన్నా ఈ వింతను వీక్షించవచ్చు.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) తో పాటు అనేక అంతర్జాతీయ టెలిస్కోప్ నెట్వర్క్లు తమ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో ఈ అద్భుతాన్ని లైవ్ ప్రసారం చేస్తాయి. తద్వారా భారతీయులు కూడా డిజిటల్ తెరలపై ఈ నిప్పుల వలయాన్ని చూడవచ్చు.
Ring of Fire | ఏ ఏ దేశాల్లో countries ఈ దృశ్యం కనిపిస్తుందంటే..
ఈ అద్భుతమైన ఖగోళ వింత ప్రధానంగా ఆఫ్రికా Africa , దక్షిణ అమెరికా South America ఖండాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా South Africa, నమీబియా Namibia, జింబాబ్వే Zimbabwe, బోట్స్వానా Botswana, మారిషస్ Mauritius, టాంజానియా Tanzania, అర్జెంటీనా Argentinaవంటి దేశాల్లో నివసించే వారు ఈ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ను నేరుగా చూడగలుగుతారు.
గ్రహణం వెనుక ఉన్న విజ్ఞానం: శాస్త్రీయ కోణంలో చూస్తే, సూర్యగ్రహణం అనేది కేవలం ఒక నీడల ఆట మాత్రమే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. అదే సమయంలో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. సూర్యుడికి, భూమికి మధ్యలోకి చంద్రుడు రావడమే సూర్యగ్రహణం. ఈ సమయంలో చంద్రుడి నీడ మన మీద పడటం వల్ల సూర్యుడు కాసేపు కనిపించడు. ఇదే సూర్యగ్రహణానికి ప్రాథమిక కారణం.