Homeఅంతర్జాతీయంRight to work of H-4 visa | భారతీయ టెకీలకు గుడ్ న్యూస్.. అమెరికా...

Right to work of H-4 visa | భారతీయ టెకీలకు గుడ్ న్యూస్.. అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Right to work of H-4 visa | యూఎస్​లోని భారత టెకీలకు అమెరికా సుప్రీంకోర్టు గుడ్​ న్యూస్​ తెలిపింది. H-4 వీసా హోల్డర్ల పని హక్కుపై అతి ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది. 

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Right to work of H-4 visa | యూఎస్​లోని భారత టెకీలకు అమెరికా సుప్రీంకోర్టు గుడ్​ న్యూస్​ తెలిపింది. H-4 వీసా హోల్డర్ల పని హక్కుపై అతి ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది.

‘సేవ్ జాబ్స్ USA’ అనే సంస్థ అమెరికా యూఎస్​ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి  తిరస్కరించారు. ఈ మేరకు H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు పని అనుమతి ఉంటుంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో వేలాది కుటుంబాలకు ఊరట కలిగినట్లైంది.

H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు పని అనుమతి విధానాన్ని పదేళ్ల క్రితం అప్పటి ప్రెసిడెంట్​ బరాక్ ఒబామా అమల్లోకి తీసుకొచ్చారు. కాగా, దీనివల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయనే వాదన ఉంది.

హెచ్-4 వీసా హోల్డర్లకు ఒబామా పని అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సుమారు తొమ్మిదేళ్లుగా న్యాయ పోరాటం కొనసాగింది. H-4 EAD విధానం వల్ల అమెరికన్లకు ఉద్యోగావకాశాలు తగ్గుతాయని ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ ‘ వాదన.

కానీ, ఈ  సంస్థ వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్దించింది. ఈ నేపథ్యంలో H-4 వీసా హోల్డర్లకు పని అనుమతి విధానం చెల్లుబాటు కానుంది.

Right to work of H-4 visa | H-4 వీసా హోల్డర్ల పని హక్కు అంటే..

2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా H-4 వీసా హోల్డర్లు పని చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.  H-1B వీసా దారులు గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) కోసం చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నట్లయితే.. వారి జీవిత భాగస్వాములు H-4 EAD కింద కొలువు / ఉపాధి పొందే అవకాశం కల్పించారు.

ఒబామా నిర్ణయం యూఎస్​లోని భారత్​ టెకీలకు వరంలా మారింది. అది ఏ విధంగా అంటే.. గ్రీన్ కార్డ్ పొందడానికి పట్టే సుదీర్ఘ కాలం (సుమారు దశాబ్దాలు) పాటు.. భర్త / భార్య ఖాళీగా ఉండే పరిస్థితి తప్పింది.