ePaper
More
    HomeతెలంగాణInformation Act | సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం

    Information Act | సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Information Act | సమాచార హక్కు చట్టం 2005 ప్రజల చేతుల్లో వజ్రాయుధం అని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్, ద్వితీయ శ్రేణి మాజీ న్యాయమూర్తి ఎంఏ సలీం (Judge M.A. Salim) అన్నారు. సమాచార హక్కుచట్టం–2005పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిజామాబాద్ ప్రెస్​క్లబ్​లో నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు (Information Act) బోర్డులను ఏర్పాటు చేసి, సంబంధిత అధికారుల పేర్లను నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర స్పోక్స్​పర్సన్ న్యాయవాది శ్రీనివాసరావు (Advocate Srinivasa Rao) మాట్లాడుతూ సమాచార హక్కుచట్టం–2005 పరిధిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తు విధానాన్ని సెక్షన్ 6(1) మరియు సెక్షన్ 19(1) రెండవ పిల్ 19 (3 ) సమాచారాన్ని ఇవ్వని అధికారులపై రాష్ట్ర కమిషన్​కు ఫిర్యాదు చేస్తే ప్రతిరోజు రూ.250/- చొప్పున 25వేల వరకు జరిమానా విధించే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్​కు ఉంటుందని తెలిపారు.

    Information Act | జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

    నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కాంతపు గంగాధర్, మహిళ అధ్యక్షురాలిగా సునీత, న్యాయ విభాగ సలహాదారులుగా శ్యామల, నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా రషీద, జిల్లా ముఖ్య సలహాదారులుగా మహమ్మద్, బోధన్ డివిజన్ అధ్యక్షురాలిగా తస్లీమ్​లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

    More like this

    Yellareddy | టెండర్ల స్వీకరణలో గందరగోళం.. దరఖాస్తుదారుల ఆందోళన

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | బాన్సువాడ (Bansuwada) ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి నూతన బస్టాండ్​లో...

    Kamareddy | అంతర్రాష్ట్ర దొంగపై పీడీ యాక్ట్​ నమోదు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అంతర్రాష్ట్ర దొంగపై పీడీ యాక్టు (PD Act) నమోదు చేసినట్లు మంగళవారం జిల్లా...

    SP Rajesh Chandra | అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్​

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా (Interstate...