Homeజిల్లాలునిజామాబాద్​AIKUS | తరుగు పేరుతో రైస్​మిల్లర్ల దోపిడీని అరికట్టాలి

AIKUS | తరుగు పేరుతో రైస్​మిల్లర్ల దోపిడీని అరికట్టాలి

రైతాంగాన్ని నిండా ముంచుతున్న రైస్​మిల్లర్లపై కఠినచర్యలు తీసుకోవాలని ఏఐయూకేఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్​ పట్టణంలో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: AIKUS | వరి ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో రైస్ మిలర్ల దోపిడీని అరికట్టాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు.

పట్టణంలోని కుమార్ నారాయణ భవన్​లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం (press conference) ఆయన మాట్లాడారు. ఖరీఫ్​ సీజన్​లో (Kharif season) కురిసిన వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపర్చాయన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10,000 నష్టపరిహారం ఇస్తామని చేతులు దులుపుకుందని.. ఇప్పటికీ నయాపైసా ఇవ్వలేదన్నారు.

మరోవైపు రైస్​మిల్లర్లు అనేక రకాలుగా దోపిడీ చేస్తూ రైతులను ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు (ice millers) తరుగు పేరుతో 3 కేజీల నుంచి 4 కేజీల వరి ధాన్యాన్ని అక్రమంగా తీసుకుంటూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్​వో లాంటి అధికారులు సైతం రైస్ మిల్లర్లకు వత్తాసు పలుకుతూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.దేవారం, జిల్లా అధ్యక్షుడు సురేష్, ప్రధానకార్యదర్శి బాబన్న, జిల్లా ఉపాధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి దామోదర్, కిషన్, కోశాధికారి లింబాద్రి, నాయకులు రమేష్, పొశన్న, లింబాద్రి, కిషోర్, సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News