అక్షరటుడే, కోటగిరి: Rice miller | అన్నదాతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం సేకరిస్తోంది. అలా సేకరించిన ధాన్యం నిల్వలను ఆయా రైస్ మిల్లులకు కేటాయిస్తోంది. కాగా, ఇలా మిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వలు ఏమవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలా కేటాయించిన ధాన్యాన్ని ఓ రైస్ మిల్లరు దుర్వినియోగం చేయడం తాజాగా వెలుగుచూసింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఇలాంటి కేసులు మరిన్ని బయటపడే అవకాశం లేకపోలేదు.
Rice miller | 6,620 క్వింటాళ్లు దుర్వినియోగం..
నిజామాబాద్ జిల్లా Nizamabad district పొతంగల్ మండలం Pothangal mandal హంగర్గ గ్రామానికి Hangarga village చెందిన ఫౌజియా రైస్ మిల్లు యజమాని మహమ్మద్ వహీద్ ఇలాగే ధాన్యం grain దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరి రైస్ మిల్లుకు ప్రభుత్వం కేటాయించిన 6620.43 క్వింటాళ్ల ధాన్యం దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించారు. వీటి విలువ రూ. 2,69,52,235 ఉంటుందని డిస్టిక్ సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ పేర్కొన్నారు.