8
అక్షరటుడే, కోటగిరి: rice mill | రైస్ మిల్లు మిషన్ బెల్టులో చుట్టుకొని ఒక మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో చోటుచేసుకుంది. కిషన్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో కూలి పని చేస్తున్న రేణిగులమ్మ (40) ఆదివారం ఉదయం 11 గంటలకు రైస్ మిల్లు ఊడుస్తుండగా ప్రమాదం జరిగింది.
rice mill | చీర చుట్టుకుని..
ప్రమాదవశాత్తు ఆమె చీర రైస్ మిల్లు మిషన్ బెల్టుకు చుట్టుకుంది. ఈ క్రమంలో ఆమె బెల్ట్ మీద పడి మిషన్‌లోకి వెళ్లింది. దీంతో రేణిగులమ్మ తీవ్రంగా గాయపడ్డారు. బాధిత మహిళకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు.