AITUC
AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం డ్యూటీలు (overtime duties) చెల్లించాలని ఏఐటీయూసీ రైస్‌మిల్‌ ఫిట్టర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఓమయ్య డిమాండ్‌ (President Omayya) చేశారు.

యూనియన్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం రద్దు చేసిన 44 రకాల చట్టాలను పునరుద్ధరించి, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జులై 9న రైస్‌ మిల్లుల్లో సమ్మె చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షుడు జాఫర్, సహాయ కార్యదర్శి సాయిలు, లాయక్, రమేష్, తిరుపతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజు, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.