అక్షరటుడే, కామారెడ్డి: Sadashivanagar mandal | ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన సదాశివనగర్ మండలం (Sadashivanagar mandal) లింగంపల్లి స్టేజి వద్ద చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం బాన్సువాడ వైపు నుంచి నిజామాబాద్ (Nizamabad) వైపు బియ్యం లోడుతో లారీ వెళ్తోంది. సదాశివనగర్ మండలం లింగంపల్లి స్టేజి వద్దకు రాగానే లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న బియ్యం బస్తాలు కింద పడిపోయాయి. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ యజమాని అక్కడికి చేరుకుని జేసీబీతో లారీని పక్కకు తప్పించి బియ్యం బస్తాలను వేరే వాహనంలో లోడ్ చేసి పంపించారు.