అక్షరటుడే, వెబ్‌డెస్క్: RGV criticizes dog lovers : భారత్ క్యాపిటల్ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను వెంటనే షెల్టర్లకు తరలించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలపై జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొందరు న్యాయస్థానం తీర్పును స్వాగతించారు.
కాగా, జంతు ప్రేమికుల ఆందోళనలపై స్పందించిన సుప్రీం.. ఈ విషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలపై జాన్వీ కపూర్(Janhvi Kapoor), సదా, సోనాక్షి సిన్హా, అడివి శేష్(, Sada, Sonakshi Sinha, and Adivi Sesh) వంటి సెలబ్రిటీలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కథానాయకి సదా అయితే ఏకంగా వీధి కుక్కలను తరలించొద్దంటూ ఏడుస్తూ వీడియో షేర్ చేశారు.
RGV criticizes dog lovers : ఘాటుగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ..
ఢిల్లీలో వీధి కుక్కల వైరం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Tollywood director Ram Gopal Varma) స్పందించారు. వీధి కుక్కల దాడిలో గతంలో చనిపోయిన అందమైన ఓ చిన్నారి వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
‘సుప్రీం తీర్పు Supreme Court పై ఏడిచే జంతు ప్రేమికులు animal lovers ఈ వీడియో ఒక్కసారి చూడండి.. ఒక నగర నడిబొడ్డున పట్టపగలే నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు వేటాడి వెంటాడి దారుణంగా పీక్కుతిని చంపేశాయి’ అని రాసుకొచ్చారు.
దీనికితోడు వీధి కుక్కల దాడులో గతంలో మరణించిన, తీవ్రంగా గాయాలపాలైన చిన్నారుల children వీడియోలను రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
RGV criticizes dog lovers : పలు విమర్శనాస్త్రాలు..
ఎక్స్ వేదికగా జంతు ప్రేమికుల(dog lovers)పై రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పలు విమర్శనాస్త్రాలు సంధించారు.
- రోడ్లపై ప్రజలను వీధి కుక్కలు కరిచి చంపేస్తున్నాయి.. కానీ, డాగ్ లవర్స్ ట్వీట్లు చేయడంలో బిజీ..
- ధనవంతుల ఇళ్లల్లో పెట్ డాగ్స్ పెంచుకుంటారు. పేద వారిపై మాత్రం వీధి కుక్కలు దాడి చేస్తుంటాయి. జంతు ప్రేమికులు దీనిపై మాట్లాడరు.
- మనిషిని మనిషి చంపితే అది మర్డర్.. కుక్క చంపితే ప్రమాదం.. ఇదేం న్యాయం?
- డాగ్ లవర్స్ వీధి కుక్కల కోసం ఏడుస్తున్నారు.. మరి వాటి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఏడవరేం..?
- “వీధి కుక్కలను చంపొద్దు” Don’t kill street dogs అని చెబుతున్న డాగ్ లవర్స్.. వాటిని దత్తత తీసుకోవచ్చుగా..! అలా చేయరు.. ఎందుకంటే ఆ కుక్కలు మురికిగా ఉంటాయనా..? వాటిని ఇంట్లోకి తీసుకెళ్తే మీ పిల్లలకు ప్రమాదం అనా..?
వీధి కుక్కలతోపాటు ఈ సమాజంలో అన్ని జంతు జాతులకు జీవించే హక్కు ఉంటుంది. అయితే, అది మనిషి జీవితాలను పణంగా పెట్టి మాత్రం కాదనే విషయం గుర్తుంచుకోవాలంటూ హితవు పలికారు.