అక్షరటుడే, బాన్సువాడ: Nano urea | నానో యూరియా వాడకంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని బీర్కూర్ మండల వ్యవసాయాధికారి కార్తిక్ అన్నారు. బీర్కూర్‌లో (Birkur) డ్రోన్ (Drone) ద్వారా నానో యూరియా వాడకం విధానం గురువారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నానో యూరియాను ప్రవేశ పెట్టడం వల్ల రైతుల ఖర్చులను తగ్గించి పంట దిగుబడులను పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ 45 కిలోల సాంప్రదాయ యూరియా బస్తాకు సమానమని, ఇది మొక్కలకు నత్రజని మరింత సమర్థవంతంగా అందిస్తుందన్నారు.
దీంతో యూరియా వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, నానో యూరియా వాడకంతో పంట దిగుబడి 8 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాంప్రదాయ యూరియా బస్తాధరతో పోలిస్తే నానో యూరియా ధర చాలా తక్కువని అన్నారు. నానో యూరియా నేల, గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ నానో యూరియా వాడకంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో మీనా, రైతులు పాల్గొన్నారు.