Homeజిల్లాలుకామారెడ్డిBanswada | అంబేడ్కర్ విగ్రహ పున:ప్రతిష్టపై సమీక్ష

Banswada | అంబేడ్కర్ విగ్రహ పున:ప్రతిష్టపై సమీక్ష

నస్రుల్లాబాద్​లోని అంకోల్​ క్యాంప్​లో అంబేడ్కర్​ విగ్రహం పున:ప్రతిష్ణకు సంబంధించి గ్రామంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. సబ్​ కలెక్టర్​ కిరణ్మయి ఆధ్వర్యంలో అభిప్రాయాలను సేకరించారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంప్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ (Ambedkar statue) పున:ప్రతిష్టపై సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే–765డీ రోడ్డు విస్తరణ పనులలో భాగంగా తొలగించాల్సిన అంబేడ్కర్ విగ్రహం పున:ప్రతిష్ట అంశంపై మంగళవారం అదనపు కలెక్టర్ విక్టర్ (Additional Collector Victor), బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), డీఎస్పీ విఠల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

రోడ్డు విస్తరణ కారణంగా విగ్రహం తొలగించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. అనంతరం గ్రామ ప్రజల అభిప్రాయాలను సేకరించారు. గ్రామంలో విగ్రహం పున:ప్రతిష్టకు అనువైన ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన్నట్లు తెలిపారు. విగ్రహ పున:ప్రతిష్ట పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో నస్రుల్లాబాద్ తహశీల్దార్ సువర్ణ, మాజీ సర్పంచ్ రాము, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు రాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.