అక్షరటుడే, నిజాంసాగర్: Sub collector Kiranmai | రెవెన్యూ సంబంధిత దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో (Revenue Conference) వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు 1,195 దరఖాస్తులు రాగా.. 306 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు.
మరో 87 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అటవీ దరఖాస్తులే (Forest Department) ఎక్కువమొత్తంలో ఉన్నాయని ఆమె వివరించారు. అనంతరం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramm Houses) నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట తహశీల్దార్ భిక్షపతి, ఆర్ఐ సాయిలు, సీనియర్ అసిస్టెంట్ విజయ్, సర్వేయర్ శ్రీకాంత్ తదితరులున్నారు.