HomeతెలంగాణACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన‌ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన‌ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

- Advertisement -

ACB Trap | అక్షరటుడే, ఇందూరు : ACB Trap | నగరంలోని మున్సిపల్​ కార్పొరేషన్​లో వీఎల్​టీ ఫైల్​ ప్రాసెస్​ చేయడం కోసం లంచం తీసుకుంటూ.. రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ ఏసీబీకి చిక్కారు.

మున్సిపాలిటీ (Municipality)లో సీనియర్​ అసిస్టెంట్​, ఇన్​ఛార్జి రెవెన్యూ ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహిస్తున్న కర్ణ శ్రీనివాస్​రావు వీఎల్​టీ ఫైల్​ను ప్రాసెస్​ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్​ చేశాడు. దరఖాస్తుదారుడి నుంచి రూ.10వేలు డిమాండ్​ చేసిన కర్ణ శ్రీనివాస్​రావు చివరకు రూ.7వేలకు బేరం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ (ACB) అధికారుల‌కు స‌మాచారం అందించాడు. ఈ క్ర‌మంలో బుధ‌వారం ఆర్ఐ లంచం తీసుకుంటుండుగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అనంత‌రం అత‌నిపై కేసు న‌మోదు చేసి, అరెస్ట్ చేశారు.

ACB Trap | అవినీతి కేంద్రాలుగా..

రాష్ట్రంలోని ప‌లు మున్సిప‌ల్ ఆఫీస్‌లు అవినీతి కేంద్రాలుగా మారాయి. ప‌నుల‌ కోసం వ‌చ్చే ప్ర‌జ‌ల‌ను లంచాల కోసం అధికారులు వేధిస్తున్నారు. పైస‌లు ఇస్తేనే ప‌నులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. నిత్యం ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా.. లంచాల‌కు మ‌రిగిన అధికారులు మార‌డం లేదు. కొంద‌రు అధికారులు అయితే ఏకంగా ఏజెంట్ల‌ను పెట్టుకొని డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు.

ACB Trap | లంచం ఇవ్వొద్దు

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Must Read
Related News