అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూ సంబంధిత సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. రుద్రూర్ మండలం రాణంపల్లి, సాలూర (Saloora) మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను (Revenue Conference) కలెక్టర్ సందర్శించారు.
అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణపై అధికారులకు సూచనలు చేశారు. స్వీకరించిన దరఖాస్తులకు రశీదులు తప్పనిసరిగా ఇవ్వాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. జూన్ 20వరకు సదస్సులు జరుగుతాయని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుడికి సమస్య విషయమై స్పష్టమైన సూచలను చేయాలని.. మళ్లీ మళ్లీ సదస్సులకు తిప్పుకోవద్దని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో Bodhan Sub Collector vikas mahato, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.