ePaper
More
    HomeతెలంగాణRTC Strike | ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

    RTC Strike | ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RTC Strike | తెలంగాణలో Telangana ఆర్టీసీ కార్మికుల RTC workers సమ్మెకు కౌంట్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మే 6 అర్ధ‌రాత్రి నుండే బ‌స్సులు అన్ని నిలిచిపోనున్నాయి. ఈ సమ్మెలో సుమారు 40,000 మంది కార్మికులు పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు.

    ఆర్టీసీ RTC జాయింట్ యాక్షన్ కమిటీ Joint Action Committee (జేఏసీ) సమ్మెకు పిలుపునివ్వ‌గా, సమ్మె నోటీసు ఇచ్చి మూడు నెలలు గడిచినప్పటికీ యాజమాన్యం management చర్చలకు పిలవకపోవడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు సమ్మె నోటీసులు strike notices ఇచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ election code నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. ఈసారి సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు జేఏసీ నేతలు JAC leaders.

    RTC Strike | చ‌ర్చించేందుకు సిద్ధం..

    ఆర్టీసీ సమ్మెపై RTC strike స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి Revanth reddy కార్మికులు సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించాలన్నారు. సమ్మె ఆలోచన సరికాదన్న ఆయన.. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం state government కట్టుబడి ఉందని తెలియజేశారు. ఇక సీఎం రేవంత్‌ CM Revanth reddy వ్యాఖ్యలపై స్పందించిన ఆర్టీసీ జేఏసీ RTC JAC తమకు సమ్మె చేయాలన్న ఆలోచన లేదంటోంది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం government పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకి వెళ్లాల్సి వస్తోందంటున్నారు. 2021 వేతన సవరణ చేయాలని.. అలాగే పెండింగ్‌ బకాయిలను pending dues సైతం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ Minister Ponnam Prabhakar అన్నారు.

    ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో Husnabad RTC bus stand మంత్రి ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్‌ల RTC conductors and drivers సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం government సిద్ధంగా ఉన్నదన్నారు. సీఎం CM ఆదేశాల మేరకు 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని రవాణా మంత్రి స్పష్టం ransport Minister clarified చేశారు.

    గత పదేళ్లుగా ఆర్టీసీ వ్యవస్థ RTC system నిర్వీర్యం అయ్యిందని.. నేడు ఆర్టీసీ RTC పూర్తిగా లాభాల దిశలో వెళ్తున్నదని తెలిపారు. పాత అప్పులు, పాత సీసీఎస్ నిధులు లాంటివి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. “మా ఆర్థిక పరిస్థితి బాలేదు అర్థం చేసుకోండి, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు financial situation దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులు RTC workers సహకరించాలి, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుంది. 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చిస్తాం” అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ Minister Ponnam Prabhakar వ్యాఖ్యానించారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...