అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డిలో (CM Revanth Reddy) ఓటమి ఫ్రస్టేషన్ కనిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించారు. వాసవి బృందావన్ అపార్ట్మెంట్లో బ్రేక్ ఫాస్ట్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-Election) ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉందన్నారు. రేవంత్ సర్కార్‌ను బీజేపీ కాపాడుతోందని విమర్శించారు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత వస్తే సంజయ్ (Bandi Sanjay) ఎక్కిడికెళ్లారని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసి అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారన్నారు.
Harish Rao | రాష్ట్రంలో వృద్ధి తగ్గింది
బీఆర్ఎస్ (BRS) హయాంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో వృద్ధి రేటు తగ్గిపోయిందని విమర్శించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రలను కాపాడామన్నారు. హైదరాబాద్‌లోనే (Hyderabad) పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడానికి బీఆర్ఎస్ కారణమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం గన్ కల్చర్ తెచ్చారని ఆరోపించారు. సిమెంట్ కంపెనీ యజమానిని గన్‌తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని మంత్రి సురేఖ కూతురు చెప్పారని గుర్తు చేశారు.
