అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Messi | ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) సందడి చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్‌తో ఆయన బరిలోకి దిగారు. మెస్సీ స్టేడియంలోకి రాగానే అభిమానుల్లో జోష్ నెలకొంది. ఈ మ్యాచ్‌లో రేవంత్‌రెడ్డి టీమ్ గెలుపొందింది.
గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. సింగరేణి ఆర్ఆర్ టీమ్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy), అపర్ణ మెస్సీ టీమ్ నుంచి మెస్సీ బరిలో దిగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో సీఎం, మెస్సీ ఫొటోలు దిగారు. అనంతరం సీఎం ఫస్ట్ గోల్ కొట్టారు. మెస్సీ రెండు గోల్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. అభిమానుల కోసం మెస్సీ ఫుట్‌బాల్ కిక్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో (Rahul Gandhi) పాటు ప్రియాంకగాంధీ కుమారుడు, కుమార్తె మ్యాచ్‌ను వీక్షించారు.
మ్యాచ్ తర్వాత స్టేడియంలో తిరుగుతూ మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు. మెస్సీ నాలుగు జూనియర్ టీమ్స్ ఫుట్‌బాల్ టిప్స్ (football tips) ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీతో ఫుట్‌బాల్ ప్లేయర్లు ఫొటోలు దిగారు. కాగా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్ జట్టు విజేతగా నిలిచింది. దీంతో మెస్సీ, రేవంత్‌రెడ్డి సింగరేణి టీమ్‌కు గోట్ కప్ అందజేశారు.
Messi | అలరించిన లేజర్ షో
ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసరాల్లో సందడి నెలకొంది. మ్యాచ్‌కు ముందు స్టేడియంలో లేజర్ షో ఆకట్టుకుంది. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ మ్యూజికల్ ఈవెంట్ అలరించింది. ఉప్పల్ స్టేడియం బందోబస్తును రాచకొండ సీపీ సుధీర్ బాబు స్వయంగా పర్యవేక్షించారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు.

