HomeతెలంగాణMLC Kavitha | రేవంత్​రెడ్డి ఓ అవినీతి చక్రవర్తి : ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha | రేవంత్​రెడ్డి ఓ అవినీతి చక్రవర్తి : ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. అలాంటప్పుడు తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. గురువారం ఉదయం కవిత బంజారాహిల్స్​లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కోడంగల్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ పథకం కోసం రెండు సంస్థలకు రూ.1,200 కోట్ల అడ్వాన్స్​ ఇచ్చారని కవిత ఆరోపించారు. కానీ ఇంతవరకు ఎత్తిపోతల పనులు ప్రారంభించలేదని విమర్శించారు. బయటకెళ్లి అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్​ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారన్నారు.

MLC Kavitha | శ్వేత పత్రం విడుదల చేయాలి

సీఎం రేవంత్​రెడ్డికి తెలంగాణ జాగృతి తరఫున అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నట్లు కవిత అన్నారు. ఆయన అవినీతి బాగోతాన్ని త్వరలోనే బయట పెడతామన్నారు. రేవంత్​రెడ్డి ప్రభుత్వంలో విద్యా, వైద్య రంగాలను విస్మరించారని విమర్శించారు. విద్య, వైద్యానికి నిధులు కేటాయించకుండా.. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt) తెచ్చిన రూ.రెండు లక్షల కోట్ల అప్పు ఏం చేశారో రేవంత్​ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

MLC Kavitha | బీజేపీ ఎంపీలు విఫలం

కేంద్రం నుంచి నిధులు తీసుకు రావడంలో రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు (BJP MP’s) విఫలం అయ్యారని కవిత విమర్శించారు. బుధవారం కేంద్ర కేబినెట్​ పుణె మెట్రోకు నిధులు కేటాయిందన్నారు. తెలంగాణ మెట్రోకు రూపాయి రాకున్నా.. ఇక్కడి బీజేపీ ఎంపీలు స్పందించడం లేదని విమర్శించారు.

గత జూలై 6న రేవంత్​రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) భేటీ అయ్యారని కవిత పేర్కొన్నారు. అనంతరం ఆయన బాబుకు హైదరాబాద్​ బిర్యానీ పెట్టి గోదావరి జలాలను గిఫ్ట్​గా ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాతే జులై 15 నాడు సెంట్రల్​ ఏజెన్సీతో బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)​ ప్రారంభమైందన్నారు.

Must Read
Related News