అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Director Sukumar | ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన కుటుంబంతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుకుమార్ కుమార్తె సుకృతిను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సన్మానించారు . ఇటీవల జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో అద్భుత నటనకు గాను సుకృతికి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు(National Best Child Actress Award) దక్కింది. మరోవైపు సుకుమార్, ఆయన భార్య తబిత, కుమార్తె సుకృతితో పాటు ప్రముఖ నిర్మాత యలమంచిలి రవిశంకర్ ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సీఎం అధికార నివాసంకి వెళ్లి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసారు.
Director Sukumar | సీఎం ప్రశంసలు..
అయితే చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సుకృతి (Sukruti Veni) ప్రతిభను ముఖ్యమంత్రి ప్రశంసించారు. సుకృతిని శాలువాతో సత్కరించి , ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పిల్లలు అన్ని రంగాలలోను ముందుండాలి. సుకృతి లాంటి బాలలు దేశానికి గర్వకారణంగా నిలవాలి అని సీఎం అన్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఆత్మీయంగా, సానుకూల వాతావరణంలో సాగింది. యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ దృక్పథాన్ని ఈ సందర్భం మరింత రుజువు చేసింది.
‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా భారీ విజయాన్నిఅందుకున్న సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి నటించిన సినిమా ‘గాంధీ తాత చెట్టు'(Gandhi Thatha Chettu) మీద ప్రేక్షకుల దృష్టి పడింది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు అవార్డులు దక్కించుకున్న ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కూడా పొందింది. ఇక ఈ సినిమాకు గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణికి పురస్కారాలు దక్కాయి. ‘గాంధీ తాత చెట్టు’ బాలల సినిమా కాదు, ఓ చిన్నారి ప్రధాన పాత్రలో రూపొందిన ఫీచర్ సినిమా అని చెప్పాలి. ఇది పెద్దలకి చక్కటి సందేశం ఇచ్చే సినిమా. ఈ చిత్రానికి వసూళ్లను మించి ప్రశంసలు ఎక్కువగా దక్కాయి.