Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్ట్​ను ఆదివారం ఆయన సందర్శించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Projects Completion | రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి  (CM Revanth Reddy) అన్నారు. ములుగు (Mulugu) జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్ట్​ను ఆదివారం ఆయన సందర్శించారు.

దేవాదుల బ్యారేజ్ పనుల వివరాలను సీఎం రేవంత్​రెడ్డి తెలుసుకున్నారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెల రోజులలోపు దేవాదుల పంప్ రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్​కు నీళ్లు మళ్లించడానికి తాము మద్దతిస్తున్నామని చౌకబారు ఆరోపణలు చేయవద్దని కేసీఆర్, హరీష్ రావులను కోరారు. తెలంగాణ నీటి హక్కుల విషయానికి వస్తే, పొరుగు రాష్ట్రాలతో కూర్చొని, చర్చలు జరిపి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామన్నారు. మీరు సూచనలు ఇస్తే, వాటిని అంగీకరిస్తామని చెప్పారు. బీఆర్​ఎస్ (BRS)​కు ఓటు వేయకపోవడం ప్రజల తప్పు అన్నట్లుగా ప్రవర్తించొద్దని విమర్శించారు.

Revanth Reddy Projects Completion | గోదావరి జలాలపై చర్చ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గోదావరి నదీ జలాల (Godavari Water) గురించి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. ప్రాజెక్ట్​లను పూర్తి చేయడానికి నిధుల కొరత ఉందని ఆయన అంగీకరించారు. అయినా కూడా రెండేళ్లలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు రూ.6 వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయిందని చెప్పారు. నేడు అది రూ.18,500 కోట్లకు పెరిగిందన్నారు. భూ సేకరణ కోసం జూన్​ 2లోపు ఈ ప్రాజెక్ట్కు రూ.600 కోట్లు మంజూరు చేస్తామన్నారు.

Revanth Reddy Projects Completion | ప్రతి ఎకరాకు సాగునీరు

తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్​రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చించి, హక్కులు సాధించుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేసి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి అవకాశం ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. బీఆర్​ఎస్​ (BRS) ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకే ఒక లక్షా రెండు వేల కోట్లు ఖర్చు చేసిందని, కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

NSUI Sandeep Challenge | సమయం ఖరారు చేసి చెప్పాలి..: ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్

అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep Challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్​కు తాము సిద్ధమని, సోమవారం...