అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy statement | జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఆయన సోమవారం సాయంత్రం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case)లో అరెస్ట్‌లపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు 20 నెలలు అమెరికా (America)లో ఉండటంతో అరెస్టులు జరగలేదన్నారు. ప్రభాకర్‌రావును భారత్‌కు తీసుకు రావడానికి కేంద్రం సహకరించలేదని ఆరోపించారు. అరెస్ట్‌ల కోసం కేటీఆర్, హరీశ్‌రావు పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్లొస్తే సీఎం అవుతామని హరీశ్‌రావు, కవిత అనుకుంటున్నారని పేర్కొన్నారు. కవిత ఇష్యూతో తనకు సంబంధం లేదని చెప్పారు
Revanth Reddy statement | 2029లో అసెంబ్లీ ఎన్నికలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) 2029లో జరుగుతాయని సీఎం అన్నారు. లెక్క ప్రకారం 2028 నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. అయితే వన్ నేషన్-వన్ ఎలక్షన్ (One Nation – One Election) ప్రాతిపదికన 2029లో జరుగుతాయని సీఎం పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ సైతం అమలు చేస్తారని తెలిపారు. తిరుమల లడ్డూ వ్యవహారం పక్క రాష్ట్రం అంశం అన్నారు. రాష్ట్రంలోని ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యి వాడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ఉండదన్నారు. జనగణన తర్వాత పునర్విభజనపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డిని తాను మంత్రి చేస్తానని చెప్పలేదని సీఎం అన్నారు. పరిగి సభలో సీఎం మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధికి నిధులు ఇస్తానని రంజిత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు. దీంతో రంజిత్‌రెడ్డిని మున్సిపల్ మంత్రి చేస్తారంటూ పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. తాజాగా దీనిపై సీఎం స్పందించారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు. మున్సిపల్ మంత్రిగా నిధులు ఇచ్చి అభివృద్ధి బాధ్యత రంజిత్ రెడ్డికి ఇస్తాను అని చెప్పినట్లు స్పష్టం చేశారు.
1 comment
[…] ‘బ్రౌన్’ హెయిర్ కలర్‌కే… Revanth Reddy statement | జిల్లాల రద్దు ఆలోచన లేదు… వివక్షకు తావులేని పని సంస్కృతి.. […]
Comments are closed.