అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy Key Comments | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ (CM Delhi Visit) పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు తానే రాజు, తానే మంత్రి అన్నారు. తనకు ఎవరూ పోటీ లేరని స్పష్టం చేశారు.
దేశ రాజధానిలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం పలువురు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తెలంగాణలో పలువురు సీఎం రేసులో ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు ఎవరూ పోటీ లేరని సీఎం చెప్పడం గమనార్హం. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని చెప్పారు. తన్ను అన్నవాళ్లనే అంటున్నానని పేర్కొన్నారు.
Revanth Reddy Key Comments | పదిన్నరేళ్లు నేనే సీఎం
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెడుతుందని సీఎం అన్నారు. దీంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) 2029 మేలో జరగుతాయన్నారు. తన పదవికాలం మరో ఆరు నెలలు పెరుగుతుందని చెప్పారు. పదిన్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. 2027 వరకు రాష్ట్రంలో జిల్లాల మార్పులు ఉండవని తెలిపారు.
Revanth Reddy Key Comments | కిషన్‌రెడ్డికి సవాల్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)కి సీఎం సవాల్ విసిరారు. సింగరేణి టెండర్ల విషయంలో 2018లోనే కేంద్రం మార్పులు చేసిందని చెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడుతానని తెలిపారు. సైట్ విజిట్ చేసే ముందు పర్మిషన్ తీసుకోవాలని ఉందన్నారు. తాను ఆ విషయాన్ని ప్రూఫ్ చేస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా అని ప్రశ్నించారు.
Revanth Reddy Key Comments | ఫోన్ ట్యాపింగ్‌పై..
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case)లో కేసీఆర్ విచారణతో క్లైమాక్స్ అనుకోవడం లేదని సీఎం అన్నారు. ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ ఈ కేసులో కీలకంగా ఉన్నారని తెలిపారు. సిట్ విచారణలో ప్రభాకర్ రావు చాలా మంది పేర్లు చెప్పారని, అందులో భాగంగానే విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు మాయం చేశారని ఆరోపించారు. కాగా కేసీఆర్ విచారణ క్లైమాక్స్ అనుకోవడం లేదని సీఎం వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నాయకుల అరెస్టులు ఉంటాయి అనేలా ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది.
1 comment
[…] Vote Counting | ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు… Revanth Reddy Key Comments | తెలంగాణకు నేనే రాజు….. Municipal Election Counting Process | మున్సిపల్ ఎన్నికల […]
Comments are closed.