HomeతెలంగాణCM Revanth Reddy | ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్‌కి రూ....

CM Revanth Reddy | ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్‌కి రూ. కోటి న‌జరానా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో ‘నాటు నాటు’ అంటూ పాటపాడి అలరించిన తెలంగాణ యువకుడు రాహుల్​ సిప్లిగంజ్ (Rahul Sipligunj) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోలో (Big Boss Show) కూడా పాల్గొని విన్న‌ర్‌గా నిలిచాడు. అయితే ఈ కుర్రాడికి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స‌పోర్ట్ ఎంత‌గానో ఉంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పేద కుటుంబం నుంచి సినీ పరిశ్రమకు వచ్చి ఆస్కార్ అవార్డు (Oscar award) గెలుచుకునే స్థాయికి వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్​ను తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తుందని అనుకున్నానని అనుకున్నాను. కానీ సన్మానం చేయకుండా నిరాశకు గురి చేసిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

CM Revanth Reddy | కోటి రూపాయ‌ల పురస్కారం..

ఆ స‌మయంలో మ‌రి కొద్ది రోజుల‌లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఏర్పడుతుందని, అధికారంలోకి రాగానే రాహుల్ సిప్లిగంజ్ కు రూ.కోటి రూపాయల నగదు బహుమతి అందజేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఆర్టిస్టులను సన్మానించుకోవాల్సిన అవసరం త‌ప్ప‌క ఉందని కూడా ఆ సంద‌ర్భంలో చెప్పారు. టీవీలో ఆస్కార్ అవార్డుల వార్తలు చూడటమే కాని.. తెలుగులో ఆస్కార్ అవార్డ్ అందుకున్న ప్రతిభావంతులు లేరంటూ రేవంత్​ అన్నారు. అయితే ఆ రోజు తాను ఇచ్చిన మాట‌ని ఇప్పుడు నిల‌బెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. రాహుల్‌కు రూ. కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్, తెలంగాణ (Telangana) యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఆయన ప్రతిభకు గౌరవంగా రూ.కోటి నగదు బహుమతి ప్రకటిస్తున్నామని తెలిపారు.

రాహుల్‌ను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. గ‌ద్ద‌ర్ అవార్డ్‌ల స‌మ‌యంలో కూడా రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్‌కి అవార్డు ఏదైనా ఉంటే ప్ర‌క‌టించాల‌ని భ‌ట్టిని కోరారు. అయితే బోనాల పండుగ సంద‌ర్భంగా కోటి రూపాయ‌ల న‌గ‌దు పుర‌స్కారాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగా, ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతం, చంద్రబోస్ సాహిత్యంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ పాట‌ని ఆల‌పించిన రాహుల్ సిప్లిగం ఆస్కార్ బహుమతిని అందుకోవడం తెలంగాణను అంతర్జాతీయంగా గర్వపడేలా చేసింది. ఆస్కార్ గెలిచిన మొదటి తెలుగు గాయకుడిగా చరిత్ర సృష్టించారు.