అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Fires on CM | కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ద్వేష రాజకీయాలకు నిదర్శనం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.
రావి నారాయణ రెడ్డి అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై (KCR) విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హరీశ్‌రావు (Harish Rao) ఎక్స్ వేదికగా స్పందించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారన్నారు.
Harish Rao Fires on CM | రేవంత్ ప్రసంగాలు చాలు
హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదని, రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలని ఎద్దేవా చేశారు. అమెరికా వెళ్లి హార్వర్డ్ యూనివర్సిటీలో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదన్నారు. ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మహాత్మ గాంధీ జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతిపితనే అన్నారు.
Harish Rao Fires on CM | మాట్లాడే హక్కు లేదు
ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి వారి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఆయనకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన ఆయనకు ఇవన్నీ ఎలా తెలుస్తాయన్నారు. సీఎం హార్వర్డ్ వెళ్ళినా, అంతరిక్షం వెళ్లినా బుద్ధి మారదని ఎద్దేవా చేశారు.