ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | రేవంత్​రెడ్డి గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్ట్​గా ఇచ్చారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    MLC Kavitha | రేవంత్​రెడ్డి గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్ట్​గా ఇచ్చారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | సీఎం రేవంత్​రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ఆమె ప్రారంభించారు. అబిడ్స్​లోని పోస్ట్​ ఆఫీస్​వద్ద ఆమె సోనియాగాంధీకి పోస్టుకార్డులు పంపారు.

    ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసం చర్చించాలని డిమాండ్​ చేశారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. బనకచర్లపై అసెంబ్లీ చర్చిద్దామని కేసీఆర్​కు సవాల్​ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందిస్తూ.. అసెంబ్లీ పెడుదామని.. ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దామని డిమాండ్​ చేశారు.

    MLC Kavitha | ప్రజల దృష్టి మరల్చడానికే..

    రేవంత్ రెడ్డి చంద్రబాబు(CM Chandrababu)ను పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్​గా ఇచ్చారని కవిత ఆరోపించారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైందని కవిత ఆమె ఎద్దేవా చేశారు. గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే కాంగ్రెస్​ అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

    MLC Kavitha | అందుకే రేవంత్​ సీఎం అయ్యారు..

    కేసీఆర్(KCR) దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసని కవిత అన్నారు. అందుకే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ(Telangana) రావడంతోనే ఈ రోజు రేవంత్​రెడ్డి సీఎం అయ్యారని గుర్తు చేశారు. అది మరిచిపోయి మాట్లాడడం బాధాకరమని ఎమ్మెల్సీ అన్నారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని పేర్కొన్నారు.

    MLC Kavitha | 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

    స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్​ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని ప్రజలు క్షమించబోరన్నారు. మహిళలకు 2500, పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపారు. ఎన్నికల ముందు సోనియా గాంధీ హామీలు ఇవ్వడంతో ప్రజలు ఓట్లు వేశారని కవిత పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదని.. అందుకే సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపుతున్నట్లు ఆమె తెలిపారు.

    More like this

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...

    Stock Market | నిలదొక్కుకున్న మార్కెట్లు.. 81 వేల మార్క్‌ను మరోసారి దాటిన సెన్సెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గత నాలుగైదు సెషన్లు కొనసాగుతున్న ట్రెండ్‌కు బ్రేక్‌ పడిరది. ఒడిదుడుకులకు...

    7th Bettalion | ఏడో బెటాలియన్​లో ఉచిత హెల్త్ క్యాంప్

    అక్షరటుడే, డిచ్​పల్లి : 7th Bettalion | మండలంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్(7th Bettalion)​లో మంగళవారం...