అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy Delhi Visit | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని కలిసిన ఆయన గురువారం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh)ను సీఎం కలిశారు. ప్రతిష్టాత్మకమైన మూసీ నది పునరుజ్జీవ (Musi River Revival) పథకంలో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ (Gandhi Sarovar) ప్రాజెక్ట్ గురించి ఆయనతో చర్చించారు. ఫిబ్రవరి చివరి వారంలో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని ఆహ్వానించారు.
Revanth Reddy Delhi Visit | నదుల సంగమం వద్ద..
ఎసా, మూసీ నదుల పవిత్ర సంగమం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఫిబ్రవరి 1948లో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని ఈ చారిత్రాత్మక సంగమం వద్ద నిమజ్జనం చేశారని తెలిపాఆరు. ఈ ప్రదేశం జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా మారిందని ఆయన కేంద్ర మంత్రికి తెలియజేశారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని లంగర్‌హౌజ్ వద్ద గల బాపూఘాట్ వద్ద ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. గాంధీ అంత్యక్రియల అనంతరం దేశంలోని పలు నదుల్లో ఆయన చితాభస్మాన్ని కలిపారు. నగరంలోని లంగర్‌హౌజ్ వద్ద సైతం కలిపారు. అక్కడ ఘాట్ నిర్మించారు. దీంతో ఆ ప్రాంతాన్ని బాపూఘాట్ అంటారు.
Revanth Reddy Delhi Visit | అభివృద్ధి చేస్తాం
పర్యావరణ పునరుద్ధరణ, స్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కీలకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలు, వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ బాపు ఘాట్‌ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, అనిల్‌కుమార్ యాదవ్, గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేడు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav), ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను సైతం కలవనున్నారు. పార్లమెంట్‌కు వెళ్లి అక్కడే కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
1 comment
[…] Harish Rao Criticizes Revanth | 62 సార్లు ఢిల్లీ… Revanth Reddy Delhi Visit | రక్షణ మంత్రిని కలిసిన… Hyderabad Bike Showroom Fire | బైక్ షోరూమ్‌లో అగ్ని… […]
Comments are closed.