అక్షరటుడే, వెబ్డెస్క్: Rythu Bandhu | తెలంగాణలో మార్పు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad district) గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులను శనివారం ఆయన సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ అంతటా తిరుగుబాటు ప్రారంభమైందని ఆయన అన్నారు. రెండేళ్లలో రెండుసార్లు రైతుబంధు (Rythu Bandhu) ఎగ్గొట్టిన దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబంధును ఖాతాల్లో వేశామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 11 సార్లు రైతుబంధు పథకం కింద రూ. 72 వేల కోట్లు వేశారని తెలిపారు.
Rythu Bandhu | అన్ని వర్గాలకు మోసం
దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అన్నారు. అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ (KCR) కాలు బయట పెట్టగానే కొన్ని జంతువులు మొరుగుతున్నాయని అన్నారు. ఒక్క మీడియా సమావేశానికే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. తాను గుంటూరులో చదువుకోవడం తప్పు అంటున్నారు, మరి రేవంత్ రెడ్డి భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకుంటే అది ఒప్పెలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎంకు పని చేతగాక రోజుకో కమిషన్, స్కామ్, కేసు అంటూ టైం పాస్ చేస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాలోత్ కవిత, సత్యవతి రాథోడ్, వినోద్ కుమార్, శంకర్ నాయక్, రెడ్యా నాయక్, హరిప్రియ నాయక్ పాల్గొన్నారు.