అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Convoy Challans | హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఎవరికైనా మినహాయింపు లేదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఎందుకంటే, తాజాగా సీఎం కాన్వాయ్‌కు చెందిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల నుంచి భారీ చలాన్లు జారీ అయ్యాయి.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఆరు నెలలలో సీఎం కాన్వాయ్(CM Convoy)లో ఉన్న వాహనాలు మొత్తం 18 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించాయి. ఈ ఉల్లంఘనలపై దృష్టిపెట్టి, మొత్తం రూ.రూ.17,795 వరకు జరిమానాలు విధిస్తూ సీఎం కార్యాలయానికి నోటీసులు పంపారు.
CM Convoy Challans | భారీ జరిమానాలు..
ఈ ఉల్లంఘనల్లో ముఖ్యంగా కొన్నింటిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లేకపోయినా కాన్వాయ్ వాహనాలు నగరంలో తిరిగిన ఘటనలు ఉన్నాయి. ఇవి సాధారణంగా అనుమతించబడని చర్యలు. అంతేకాదు, కొన్ని వాహనాలు అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై హల్చల్ చేసినట్లు ట్రాఫిక్ అధికారులు(Traffic Officers) గుర్తించారు. దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలన్నీ సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేయబడినవే. వాటిని నిశితంగా పరిశీలించిన పోలీసులు సాధారణ ఉల్లంఘనలపై మినహాయింపునిస్తూ, తీవ్రమైన 18 ఉల్లంఘనలపై మాత్రమే చలాన్లు జారీ చేశారు.
గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ..“ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules)ఉల్లంఘిస్తే చలాన్లు తప్పవు. నేను తప్పు చేసిన, నాకు కూడా మినహాయింపు లేదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ట్రాఫిక్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకంగా నిలిచినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు సీఎంవోకి జారీ చేసిన జరిమానాలు ఆ వ్యాఖ్యలకు అద్దంపడుతున్నాయి.TG09 RR0009 నంబర్‌గల వాహనాలపై ఇప్పటివరకు మొత్తం 18 పెండింగ్ చలానాలు ఉండగా, వాటి మొత్తం విలువ రూ.17,795. వీటిని ఎవరు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.