అక్షరటుడే, వెబ్డెస్క్ : Revanth Reddy Municipal Victory | మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం రాత్రి సమావేశం అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ ఆయన అభినందించారు.
మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) కాంగ్రెస్ సత్తా చాటిన విషయం తెలిసిందే. దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్ ఈ సమావేశానికి హాజరు అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ జామ్ మీటింగ్ ద్వారా పాల్గొన్నారు.
Revanth Reddy Municipal Victory | సమష్టి కృషితో..
అందరం కలిసి కట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ విజయం కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపించిందన్నారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాయని ఆయన పేర్కొన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు.