అక్షరటుడే, హైదరాబాద్: Revanth described KCR : అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాల విషయాలపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జలాశయాలు ప్రాజెక్టుల ద్వారా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఏవిధంగా ప్రజాధనం దుర్వినియోగం చేశారో వినియోగించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఏవిధంగా పెంచి దోచుకున్నారో వర్ణిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి అతడు చిత్రం కథనాన్ని చెప్పుకొచ్చారు.
Revanth described KCR | అంచనా వ్యయం పెంచుతూ..
సీఎం రేవంత్ మాటలు ఇలా.. అతడు చిత్రంలో ఓ రాజకీయ నాయకుడిని పైనుంచి ఒకడు కాలుస్తాడు. విచారణకు వచ్చే సీబీఐ అధికారి CBI officer.. హత్య ఎవడు చేసి ఉంటాడని జైలులోని పాత క్రిమినల్స్‌ను విచారిస్తాడు. అప్పుడు సదరు అధికారికి తెలుస్తుందేమిటంటే.. ప్రతి నేరగాడికి ఓ ప్యాటర్న్ ఉంటుందని. అంటే జేబులు కట్ చేసేవాడికి, చైన్ స్నాచర్లకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌లా ప్రాజెక్టుల అంచనాలు పెంచుకుంటూ దోచుకునే వారికి ఓ విధానం ఉంటుందని సీఎం రేవంత్ వర్ణించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో రూ.55 వేల కోట్లు కొల్లగొట్టాలని కేసీఆర్ ప్రణాళిక రచించినట్లు ఆరోపించారు. డీపీఆర్ లేకుండానే రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టకుండా.. దాని మార్చేసి, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మించారన్నారు. దీని అంచనాలను రూ.38,500 కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచారని ఎద్దేవా చేశారు.
జూరాల వద్ద కట్టాల్సిన పాలమూరును శ్రీశైలానికి మార్చేసి రూ. 32,800 కోట్ల నుంచి రూ. 90 వేల కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచుకుపోయారని ఆరోపించారు. ఇలా ఎత్తిపోతలు, ప్రాజెక్టుల పేరిట వాటి అంచనాల వ్యయాన్ని పెంచుకుంటూ పోయి, రూ. వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కానీ, కొత్తగా ఒక ఎకరానికి కూడా సాగు నీరు ఇవ్వలేదని రేవంత్ దుయ్యబట్టారు.