HomeUncategorizedRetro movie review | రెట్రో మూవీ ఫుల్ రివ్యూ.. సూర్య ఖాతాలో సక్సెస్ చేరిందా?

Retro movie review | రెట్రో మూవీ ఫుల్ రివ్యూ.. సూర్య ఖాతాలో సక్సెస్ చేరిందా?

- Advertisement -

Akshara Today Movie Desk: 

నటీనటులు : సూర్య, పూజా హెగ్డే, జయం రవి, జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, శ్రియా శరణ్ తదితరులు
దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు : సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం
సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ
కూర్పు : షఫీక్ మొహమ్మద్ అలీ

సినిమా హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచాల‌నే ఉద్దేశంతో సినిమాలు చేస్తుంటారు కోలీవుడ్ హీరో సూర్య‌(Kollywood Hero Suriya). పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘రెట్రో’(Retro). సూర్య ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందింది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా క‌థేందో చూద్దాం.

కథ: 1993 సమయంలో జరిగే కథగా దీనిని చెప్పుకురాగా, చిన్నతనంలోనే పారివేల్ కణ్ణన్ (సూర్య) తన తల్లిదండ్రుల నుంచి వేరయ్యి ఒక గ్యాంగ్ స్టర్ తిలక్ రాజ్ (జోజు జార్జ్) కి దొరుకుతాడు. భార్య కోరిక మేర‌కి పారివేల్‌ని పెంచుకుంటాడు కానీ అత‌ను ఏ మాత్రం ఇష్టం ఉండ‌దు. ఓ సారి రుక్మిణి (పూజా హెగ్డే) తో జరిగిన పరిచయం ఎలా ప్రేమగా మారింది. అయితే అనుకోని పరిస్థితుల‌లో గ్యాంగ్ స్ట‌ర్‌(Gangster)గా మారిన సూర్య వదిలేద్దామ‌ని అనుకుంటాడు. కాని మ‌ళ్లీ గ్యాంగ్‌స్ట‌ర్​గా మారాల్సి వ‌స్తుంది. ఎందుకు అలా మారాల్సి వ‌చ్చింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Retro movie review | న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్

సూర్య(Suriya) న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రోసారి త‌న పాత్ర‌లో జీవించాడు. సూర్య తన నటనతో ఈ మూవీని వీలైనంతవరకు సక్సెస్(Success) తీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు. పాత్రకి ఎంతైతే కావాలో అంతవరకే నటించి మెప్పించాడు. సూర్య ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లన్నింటిలో ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్(Different Character) గా నిలిచిపోతుంది. పూజా హెగ్డే(Pooja Hegde) పర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. ఆమె పాత్రకి మంచి స్కోప్ ఉండ‌డంతో జీవించేసింది. ఇక ప్రకాష్ రాజ్(Prakash Raj) కూడా చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. మలయాళం నటుడు ‘జోజ్ జార్జ్’(Joju George) విలన్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయి నటించాడు. మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్: ముందుగా నిర్మాణ విలువ‌ల గురించి మాట్లాడుకోవాలి. అవి చాలా రిచ్‌గా ఉన్నాయి. సంతోష్ నారాయణన్(Santosh Narayanan) తన సంగీతంతో చాలా సీన్స్ కి మంచి స్కోర్ అందించి ఎలివేట్ చేసాడు. శ్రేయస్ కృష్ణ(Shreyas Krishna), సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎంచుకున్న లైన్ అందులో పాయింట్స్ బాగున్నాయి కానీ వాటికి అనుగుణంగా రాసుకున్న కథనం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆక‌ట్టుకోలేదు. ఫస్టాఫ్ వరకు మాత్రం తన మార్క్ కనిపించింది.

ప్లస్ పాయింట్స్:

ఫ‌స్టావ్
సూర్య న‌ట‌న‌
ఎమోష‌న‌ల్ సీన్స్,
సింగిల్ టేక్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ కొన్ని సీన్స్
క‌థ లైన్ త‌ప్ప‌డం
ప్రీ క్లైమాక్స్

విశ్లేష‌ణ: డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా కమర్షియల్(Commercial) సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఏ మాత్రం ఎక్క‌దు. యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు(Director Karthik Subbaraj) . దర్శకుడిగా చాలా సందర్భాల్లో తనను తాను ప్రూవ్ చేసుకున్న కార్తీక్ సుబ్బరాజు రైటర్ గా కూడా మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడు. సూర్య సాలిడ్ పెర్ఫామెన్స్ తో సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచారు . సూర్య అభిమానులు వరకు చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ మూవీ చూస్తే బెట‌ర్.

రేటింగ్: 2.25/5