అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | ఎలాంటి రిమార్క్ లేకుండా పదవీ విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కొనియాడారు.
పోలీస్ కార్యాలయంలో (Police Office) గురువారం రిటైర్ అవుతున్న వేల్పూర్ ఏఎస్సై సీహెచ్ మురళీధర్ రాజు (Velpur ASI CH Muralidhar Raju), ఏఆర్ ఎస్సైలు ఐఎల్ నర్సింలు, ఎస్ సత్యనారాయణ గౌడ్నుఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనిఒత్తిడి ఉంటుందని.. ఆ ఒత్తిడిలో పనిచేస్తూ ఎలాంటి రిమార్క్ లేకుండా పనిచేయడం గొప్ప విషయమన్నారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని.. వీరు డిపార్ట్మెంట్కు చేసిన సేవలు ఎంతో విలువైనవని సీపీ అన్నారు. పదవీ విరమణ అనంతరం ఎలాంటి సాయం అవసరమైనా పోలీస్‌శాఖ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి, సతీష్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.