అక్షర టుడే, వెబ్‌డెస్క్: Yellareddy | ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి (Yellareddy RDO Parthasimha Reddy) అన్నారు. పంచాయతీరాజ్ డీఈ గిరి (Panchayat Raj DE Giri) ఉద్యోగ విరమణ పొందగా.. సోమవారం పట్టణంలో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ (retirement) తప్పనిసరన్నారు. గిరి తన పదవీ కాలంలో చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయన్నారు. ఆయన తన ఉద్యోగ ప్రస్థానంలో నిబద్ధతతో సేవలందించారని, చాలామందికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన గిరి మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రజలు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులతో తనకు సత్సంబంధాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు.
అందరి సహకారంతో విజయవంతంగా తన ఉద్యోగ ప్రస్థానం కొనసాగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గిరిని వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.