Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజం: సీపీ సాయిచైతన్య

Nizamabad City | ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజం: సీపీ సాయిచైతన్య

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజమని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. పోలీసు శాఖలో (police department) పనిచేసిన డి ఎల్లయ్య గౌడ్‌ (సీఐ, వీఆర్, నిజామాబాద్‌), టి.నర్సింలు (ఎస్సై, సీసీఆర్‌బీ నిజామాబాద్‌ ), ఎల్‌.యాకుబ్‌ రెడ్డి (హెడ్‌ కానిస్టేబుల్, టాస్క్‌ ఫోర్స్, నిజామాబాద్‌) ఉద్యోగ విరమణ పొందారు.

దీంతో శనివారం తన కార్యాలయంలో వారికి వీడ్కోలు కార్యక్రమం (farewell program) నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్‌శాఖలో ఎంతో పని ఒత్తిడితో పనిచేసి, ఎలాంటి రిమార్క్‌ లేకుండా ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ (అడ్మిన్‌) బస్వారెడ్డి, ఆర్‌ ఎస్సై శ్రీనివాస్, తిరుపతి, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ శంకర్, బషీర్‌ అహ్మద్, షకీల్‌ పాషా, తదితరులు పాల్గొన్నారు.