అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పదవీ విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఎన్ఐబీ సీఐ వెంకటయ్య (NIB CI Venkataiah) పదవీవిరమణ చేస్తున్న సందర్భంగా సీపీ ఆయనను ఘనంగా సత్కరించారు.అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పనిఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవీ విరమణ (Retirement) చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ తప్పక ఉంటుందన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి ఆఫీస్ సూపరింటెండెంట్స్ శంకర్, బషీర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

