Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | పదవీ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలి

Nizamabad City | పదవీ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలి

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ డిమాండ్​ చేసింది. సంఘం ప్రతినిధులు కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | ఉపాధ్యాయులకు 2024 నుంచి పదవీ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సుకున్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్​లో (Collectorate) సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీపీఎఫ్, జీఐఎస్, ఈఎల్స్​, మెడికల్ బిల్లులు (medical bills) , పీఆర్సీ బకాయిలు, ఏరియర్స్​ను వెంటనే విడుదల చేయాలని కోరారు. పెన్షన్ బకాయిలు రాక ఎందరో పెన్షనర్లు అప్పుల (pension dues) పాలవుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు (group life insurance money) కూడా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు బన్సీలాల్, రాజేందర్, శంకర్ గౌడ్, పూర్ణచంద్రరావు, హన్మాండ్లు, ఉమాకాంత్, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతన్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News