అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad city | సుదీర్ఘ కాలం పాటు అనేక మంది కలెక్టర్ల దగ్గర సేవలందించిన రిటైర్డ్ రిటైర్డ్ జందార్ వేముల నారాయణ(87) అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం స్థానిక వినాయక్‌నగర్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1937 సంవత్సరంలో నిజామాబాద్‌లో జన్మించిన నారాయణ 1960వ సంవత్సరంలో కలెక్టర్ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారు.
సుదీర్ఘకాలం పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలలో ఆయన సేవలందించారు. 1980వ సంవత్సరం నుంచి కలెక్టర్ జందార్గా పనిచేశారు. అప్పుడు జిల్లాలో పనిచేసిన ఆర్.చంద్రశేఖర రావు, అజేంద్ర పాల్, చక్రపాణి, షీలా బేడీ, ఉరిమెల సుబ్బారావు, బినయ్ కుమార్, తుకారం హయాంలో పనిచేయగా.. 1999లో ఆర్ఎం గోనెల కలెక్టర్‌గా ఉన్నప్పుడు పదవీ విరమణ చేశారు. ఆయన మృతి పట్ల టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, అర్బన్ ప్రెసిడెంట్ జాకీర్, ఉపాధ్యక్షుడు జాఫర్, ఎస్సార్ ఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ రాజ్, ఇతర శాఖల అధికారులు సంతాపం ప్రకటించారు.