ePaper
More
    Homeక్రైంCyber Fraud | రిటైర్డ్​ ఐఏఎస్​కు సైబర్​ నేరస్తుల టోకరా.. రూ.3.37 కోట్లు స్వాహా

    Cyber Fraud | రిటైర్డ్​ ఐఏఎస్​కు సైబర్​ నేరస్తుల టోకరా.. రూ.3.37 కోట్లు స్వాహా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Cyber Fraud | సైబర్​ నేరస్తులు cyber criminals రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. వర్క్​ ఫ్రం హోమ్ work from home​, స్టాక్​ మార్కెట్ stock market​లో లాభాలు, క్రిప్టో కరెన్సీ crypto currency పేరిట ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వీరి మాయలో పడి మోసపోతున్న వారిలో అధిక శాతం విద్యావంతులే ఉండటం గమనార్హం. తాజాగా ఓ రిటైర్డ్​ ఐఏఎస్ retired IAs​ అధికారి సైబర్​ నేరగాళ్ల చేతిలో రూ.3.37 కోట్లు మోసపోయాడు.

    Cyber Fraud | స్టాక్​ మార్కెట్​లో లాభాలని చెప్పి..

    ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్​ సెక్రెటరీ హోదాలో పని చేసిన ఓ ఐఏఎస్​ అధికారి (72)కు సైబర్​ నేరస్తుడు వల వేశాడు. సోమాజీగూడ somajigudaలో నివాసం ఉంటున్న ఆయనకు స్టాక్​ మార్కెట్​లో లాభాల పేరిట ఎర వేశాడు. తాము రూపొందించిన ఏఐ పరిజ్ఞానంతో AI Technology మ్యూచువల్ ఫండ్స్ Mutual Funds, ఐపీవోల్లో IPO పెట్టుబడులు పెడితే లిస్టింగ్ సమయం లోనే 120-160 శాతం వరకు లాభాలు పొందొచ్చని నమ్మించాడు.

    అంతేగాకుండా నిత్యం ఆయనకు ఫోన్​ చేస్తూ స్టాక్​ మార్కెట్​కు సంబంధించిన సలహాలు ఇచ్చాడు. దీంతో ఆ మాజీ అధికారి వారి మాటలు నమ్మి స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నాడు. దీని కోసం నిందితుడు చెప్పిన ఖాతాల్లోకి విడతల వారిగా రూ.3.37 కోట్లను వేశాడు. దీనికి రూ.22.35 కోట్ల లాభమొచ్చిందని మాజీ ఐఏఎస్‌కు వర్చువల్ ఖాతాలో చూపించాడు. అయితే ఆ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...