ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Current Bill | రిటైర్డ్ హెడ్‌మాస్టర్‌కు రూ.15 లక్షల కరెంట్​ బిల్లు.. చూసి అంద‌రూ షాక్

    Current Bill | రిటైర్డ్ హెడ్‌మాస్టర్‌కు రూ.15 లక్షల కరెంట్​ బిల్లు.. చూసి అంద‌రూ షాక్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Current Bill | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఓ రిటైర్డ్ హెడ్‌మాస్టర్‌కు వచ్చిన కరెంట్ బిల్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. ఎందుకంటే ప్రతి నెల తక్కువ బిల్లు వచ్చేది. రూ.1300–1500 కు మించేది కాదు.

    కానీ, తాజా బిల్లులో ఏకంగా రూ.లక్షలు దాటింది ఏకంగా రూ.15,14,993 వచ్చింది. అందుకే ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయింది. ఈ సంఘటన కోనసీమ Konaseema జిల్లా మామిడికుదురు మండలం పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు నన్నేషా హుస్సేన్ అనే రిటైర్డ్ స్కూల్ హెడ్‌మాస్టర్. విద్యార్థులకు నూతన భవిష్యత్తును తీర్చిదిద్దిన ఓ గొప్ప ఉపాధ్యాయుడికి ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థే నిరాశ కలిగించిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

    Current Bill : బిల్లు చూసి అవాక్కయ్యారు…

    నన్నేషా హుస్సేన్ గత నెల కరెంట్ బిల్లు చూస్తే అందులో 1,00,846 యూనిట్లు వినియోగించారని ఉంది. ఆ మేరకు రూ.15,14,993 రూపాయల బిల్లు వేయబడింది. దీనిపై ఆయన తీవ్ర ఆవేదనతో స్పందించారు.. “ఇంత క‌రెంట్ బిల్లు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నేను సగటు పౌరుడిని, రిటైర్డ్ వ్యక్తిని. ఇంత ఎక్కువ కరెంట్ Current ఎలా వాడతాను? మాకు ఈ దెబ్బతో ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. బిల్లు గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ లైన్‌మన్‌ను అడిగితే, మీటరు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపాడట. “మీటరులో తప్పు ఉంది, కొత్త మీటర్ కోసం అప్లై చేసుకోండి” అని అధికారుల నుంచి సమాధానం వచ్చినట్లు హుస్సేన్ చెప్పారు.

    “డబ్బు ఇచ్చి నేను డిజిటల్ మీటర్ పెట్టించుకున్నాను. ఇప్పుడు మీటర్ Meter లోపం ఉందని చెప్పడం దురదృష్టకరం. నేను మళ్లీ మీటర్‌కు అప్లై చేయను. ఇది ప్రభుత్వ వైఫల్యం. నేను చాలా ఆవేద‌నతో ఉన్నాను. నాకే ఇలా ఉంటే మరి పేదల పరిస్థితి ఏమిటి?..” అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

    ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చాలామంది వినియోగదారులకు డిజిటల్ మీటర్ల వ్యవహారంలో ఇలాంటి అనుమానాస్పద బిల్లులు వస్తున్నట్టు నివేదికలు వస్తున్నాయి. కరెంట్ వినియోగం తగ్గినప్పటికీ, బిల్లులు ఎక్కువగా రావడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

    “ఈ సంఘటనను రాష్ట్ర విద్యుత్ శాఖ సీరియస్‌గా పరిగణించాలి.. సాధారణ వినియోగదారుని రూ.లక్షల్లో బిల్లు వేసి, దానిని చెల్లించమని కోరడం అన్యాయం.. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధితుడికి న్యాయం చేయాలి” అని ప్రజాప్రతినిధులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...