Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | శేష జీవితాన్ని సంతోషంగా గడపాలి

Nizamabad CP | శేష జీవితాన్ని సంతోషంగా గడపాలి

అక్షర టుడే, వెబ్‌డెస్క్: Nizamabad CP | ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని, శేష జీవితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు శాఖకు (police department) చెందిన పలువురు ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందగా, సీపీ కార్యాలయంలో మంగళవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ (retirement) పొందిన కె బాబురావ్‌(ఎస్సై, వన్‌టౌన్‌), ఎండీ నసీరుద్దీన్‌(ఎస్సై, ఐడీఓసీ), కె వనజారాణి(ఆఫీస్‌ సూపరింటెండెంట్‌)లను శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సీపీ మాట్లా డుతూ.. ఉద్యోగులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎలాంటి రిమార్కులు లేకుండా విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ (అడ్మిన్‌) బస్వారెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ, ఎస్‌బీ సీఐ శ్రీశైలం, వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ రఘుపతి, రూరల్‌ ఎస్సై ఎండీ ఆరీఫ్, ఆర్‌ ఎస్సై తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.