అక్షరటుడే, ఇందూరు: MCN | తమ దుకాణాల ఎదుట మురికి కాలువ సమస్యను పరిష్కరించాలని లలిత కాంప్లెక్స్ (Lalitha Complex) షాప్ రెంటల్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని హరిచరణ్ పాఠశాల (Haricharan School) పక్కన ఉన్న లలితా కాంప్లెక్స్ దుకాణదారులు కాంప్లెక్స్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మురికి కాలువ మరమ్మతుల కోసం ఎనిమిది నెలల క్రితం మున్సిపల్ సిబ్బంది జేసీబీతో తవ్వారన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు దానిని పూడ్చలేదని దీంతో అనేక సమస్యలు ఎదురవుతున్నామన్నారు.
MCN | ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా..
విషయాన్ని మున్సిపల్ కమిషనర్‌తో పాటు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశామన్నారు. నిత్యం దోమలతో అనారోగ్యల పాలవుతున్నామని, తమ వ్యాపారాలు సైతం దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎవరికి చెప్పినా తమ సమస్యను పరిష్కరించడం లేదన్నారు. ప్రజా ప్రతినిధులు ఇటువైపు నుంచి ఎన్నిసార్లు వెళ్లినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధర్నాలో దుకాణ యజమానులు ఫయాజ్, వేణు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.