అక్షర టుడే, బోధన్: Bodhan | మండలంలోని మినార్పల్లి సహకార సంఘం కార్యదర్శి కె.హన్మాండ్లు బదిలీని నిలిపేయాలని సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన మహాజన సభలో (Mahajana Sabha) తీర్మానం చేశారు. ఆయన బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యథాస్థానంలో కొనసాగించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సందర్భంగా సభ్యులు, రైతులు (members and farmers) మాట్లాడుతూ.. మినార్పల్లి సహకార సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్న హన్మాండ్లును బోధన్‌కు (Bodhan) బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికే పాలకవర్గ మండలి బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని తీర్మానించిందన్నారు. మహాజన సభలోనూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే, యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యం బోనస్ డబ్బులు (bonus money) విడుదల చేయాలని, రుణమాఫీ చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని తీర్మానించారు. సమావేశంలో సహకార సంఘం ఛైర్మన్ మెట్ల రవీంద్ర బాబు, వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రావు, డైరెక్టర్లు పామేశ్వర్ రావు, దేవయ్య, సుజాత, నారాయణ, సభ్యులు వసంత్ రావు, షాకిర్ పటేల్, సాయరెడ్డి, మన్సూర్ పటేల్, తారాచంద్, వెంకట్రావు, మోతీరాం, రమణ, రైతులు పాల్గొన్నారు.