అక్షరటుడే, బాన్సువాడ:Disabled Reservations | ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు(Reservations) కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు గంగాధర్ చారి(Gangadhar Chari) డిమాండ్ చేశారు. శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఏవో సువర్ణ(DAO Suvarna)కు వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు ప్రత్యేక శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటు చేసి 150 రోజులు పని కల్పించాలని, వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డు(Antyodaya Ration Card) జారీ చేయాలని కోరారు. బాన్సువాడ కేంద్రంగా వైకల్య ధృవీకరణ పత్రాల జారీ కోసం సదరం క్యాంప్ నిర్వహించాలన్నారు. బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్ ఆర్టీసీ షాపింగ్ కంప్లెక్స్లలో ఐదు శాతం వికలాంగులకు కేటాయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బస్వయ్య, సంగప్ప, గంగారాం, సంగ్రామ్, రవీందర్, సంగవ్వ తదితరులు పాల్గొన్నారు.