అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల పరిధిలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు అయింది. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.
ఆలూరు (Aloor) మండలంలోని గ్రామాలకు సంబంధించి సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.. ఆలూర్ బీసీ (మహిళ), గుత్ప తండా ఎస్టీ (జనరల్), గగ్గుపల్లి ఎస్సీ (మహిళ), ఢీకంపల్లి బీసీ (జనరల్), కల్లడి బీసీ (జనరల్), రామచంద్ర పల్లి బీసీ (మహిళ), గుత్ప ఎస్సీ జనరల్, దేగాం ఓసీ (జనరల్), మచ్చర్ల (జనరల్) మహిళ, మిర్దపల్లి (జనరల్), రామస్వామి క్యాంప్ (జనరల్).
ఎంపీటీసీ స్థానాలకు.. గుత్ప ఎస్సీ (మహిళ), మిర్దపల్లి ఎస్సీ (జనరల్), ఆలూర్–1 బీసీ (మహిళ), ఆలూర్–2 బీసీ (జనరల్), డీకంపల్లి బీసీ (జనరల్), కల్లడి బీసీ (జనరల్), దేగాం బీసీ (జనరల్) మహిళ, మచ్చర్ల బీసీ (జనరల్). ఆలూర్ జెడ్పీటీసీ స్థానానికి ఎస్సీ మహిళ, ఎంపీపీ స్థానానికి ఎస్సీ జనరల్ రిజర్వేషన్లు ఖరారు చేశారు.
Local Body Elections | భీమ్‌గల్‌లో..
భీమ్‌గల్ (Bheemgal) మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 244 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించినట్లు తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో రిజర్వేషన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Local Body Elections | బోధన్‌లో..
బోధన్ (Bodhan) నియోజకవర్గంలోని జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. బోధన్ మండలం ఎస్సీ (జనరల్), రెంజల్ జనరల్, నవీపేట్ బీసీ (జనరల్), ఎడపల్లి జనరల్ (మహిళ), సాలూర ఎస్సీ (మహిళ)కు కేటాయించారు.