అక్షరటుడే, వెబ్‌డెస్క్: Municipal Elections | రాష్ట్ర ప్రభుత్వం (State Government) మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మేయర్, మున్సిపల్ ఛైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేసింది.
పురపోరుకు త్వరలో నగరా మోగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా ప్రకటించారు. వార్డుల వారీగా రిజర్వేషన్లను జిల్లాల్లో అధికారులు శనివారం లక్కీ డ్రా ద్వారా ఖరారు చేశారు. తాజాగా ప్రభుత్వం మేయర్, చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను విడుదల చేసింది. మహిళలకు 50 శాతం పదవులు కేటాయించింది.
Municipal Elections | మేయర్ పదవుల రిజర్వేషన్లు
రాష్ట్రంలో పది కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో కొత్తగూడెం మేయర్ (Kothagudem Mayor) పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. రామగుండం పీఠాన్ని ఎస్సీ జనరల్‌కు, మహబూబ్‌నగర్‌ను బీసీ మహిళకు, మంచిర్యాల, కరీంనగర్ బీసీ జనరల్‌కు కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. జనరల్ మహిళకు ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ మేయర్ పదవిని జనరల్‌కు ఖరారు చేశారు.