అక్షరటుడే, హైదరాబాద్: local bodies Reservations | రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజ్వరేషన్లు ఎట్టకేలకు ఖరారు అయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడమే తరువాయి.
ఈ నెల (సెప్టెంబరు) 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముందుగా జడ్పీటిసీ, ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమైంది.
ఈసీ ఆదేశాల మేరకు శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లు.. స్థానిక రాజకీయ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ స్థానాలను వెల్లడించారు.

